'పుష్ప' రెండు భాగాలుగా రానుందంటూ రూమర్!
- స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
- ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్
- గ్రామీణ యువతిగా రష్మిక
- నిడివి పెరగనుందంటూ టాక్
ఉత్కంఠభరితమైన కథాకథనాలతో .. ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా నడుస్తుంది. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. దీంతో ఈ సినిమా నిడివి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. అయితే తాను చెప్పదలచుకున్న విషయాన్ని తగ్గించి చెప్పడం వలన ఇంపాక్ట్ పోతుందని భావించిన సుకుమార్, రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. ఒక భాగాన్ని దసరాకి విడుదల చేసి, మరో భాగాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాడని అంటున్నారు.