లాక్ డౌన్ అవసరం లేదంటున్న సీఎస్ పరిస్థితి ఎక్కడ బాగుందో చెప్పాలి: వీహెచ్
- తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్న సీఎస్
- కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయన్న వీహెచ్
- ఆక్సిజన్, బెడ్లు లభించడంలేదని వ్యాఖ్యలు
- సీఎస్ వాస్తవాలు చెప్పాలంటూ వీహెచ్ డిమాండ్
లాక్ డౌన్ అవసరం లేదంటున్న సీఎస్, పరిస్థితులు ఎక్కడ బాగున్నాయో చెప్పాలని నిలదీశారు. నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకలు దొరకడంలేదని వీహెచ్ తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని విమర్శించారు. బెంగాల్ సీఎంపై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. వెంటనే మమతా బెనర్జీకి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.