వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.90.99
- డీజిల్ ధర రూ.81.42
- హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.94.57
- డీజిల్ ధర రూ.88.77
నిన్నటితో పోల్చితే లీటరు పెట్రోలు ధర 25 పైసలు, డీజిల్ ధర 30 పైసలు పెరిగింది. ముంబైలో ఈ రోజు లీటరు పెట్రోలు ధర రూ.97.34, డీజిల్ ధర రూ.88.49గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.92.90గా, డీజిల్ ధర రూ.86.35గా ఉంది.
ఇక కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.91.14, డీజిల్ ధర రూ.84.26కి చేరింది. అలాగే, హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర ఈ రోజు 23 పైసలు పెరిగి రూ.94.57గా ఉండగా, డీజిల్ ధర 31పైసలు పెరిగి రూ.88.77గా ఉంది.