మోదీ చెప్పడమే తరువాయి.. లాక్‌డౌన్ పెట్టేస్తాం: యడియూరప్ప
- రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 44 వేలకు పైగా కేసులు
- కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా తగ్గని ఉద్ధృతి
- ఈ రోజే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామన్న సీఎం
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని యోచిస్తున్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 44,631 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ వైపు ముఖ్యమంత్రి దృష్టిసారిస్తున్నారు. ప్రధాని ఆదేశాల అనంతరం నేడే ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు యడియూరప్ప వివరించారు.