తెలంగాణలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండదు కానీ.. : ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
- రాష్ట్రంలో వైరస్ పూర్తిస్థాయిలో అదుపులో ఉంది
- లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది
- లాక్‌డౌన్ కంటే ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం ముఖ్యం
- వారాంతపు లాక్‌డౌన్ గురించి ఆలోచిస్తున్నామన్న సీఎస్
రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంపై సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు ఆ నిర్ణయం తీసుకున్నాయన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు జీవనోపాధిని కోల్పోతారన్నారు. అయితే, రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అవసరమైనప్పుడు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.