'పుష్ప' కోసం భారీస్థాయిలో విలేజ్ సెట్!
- షూటింగు దశలో 'పుష్ప'
- బన్నీ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్
- ప్రత్యేక ఆకర్షణగా ఊర్వశీ రౌతేలా ఐటమ్
సుకుమార్ 'రంగస్థలం' సినిమాకి కూడా విలేజ్ సెట్ వేయించిన సంగతి తెలిసిందే. ఎంతో సహజంగా అనిపించిన ఆ సెట్ ఆ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అలా 'పుష్ప' సెట్ కూడా ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని అంటున్నారు. ఈ నెల రెండవ వారం నుంచి ఈ సెట్లో షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, బన్నీ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.