ఒక్క రూపాయి కూడా పంచని కమల్... ఒక్క సీటూ ఇవ్వని తమిళులు!
- 142 స్థానాల్లో పోటీ పడిన కమల్ పార్టీ
- అధినేత సహా అందరూ ఓటమి
- విలువలకు కట్టుబడిన వ్యక్తని ప్రశంసలు
ఈ ఎన్నికల్లో కమల్ సహా ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎంఎన్ఎం తరఫున బరిలోకి దిగిన వారంతా ఎక్కడా డబ్బులు పంచలేదు. దీంతో వారెవరికీ ఓట్లు పడలేదని ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి. కోయంబత్తూరు దక్షిణం నుంచి బరిలోకి దిగిన కమల్, బీజేపీ అభ్యర్థి వాసతి చేతిలో దాదాపు 1,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.