పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందని నేను భావించడం లేదు: ఉద్ధవ్ థాకరే
- కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10 లక్షలకు చేరేవి
- కఠిన నిబంధనలతో రోజు వారీ కేసులు తగ్గాయి
- నిన్న 3 లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చాయి
తాజాగా చేపట్టిన కఠిన నిబంధనలతో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదలను కట్టడి చేశామని ఉద్ధవ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.5 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. గత ఏడాది మాదిరే... ఇప్పుడు కూడా అందరం కలసికట్టుగా మహమ్మారిని కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు. 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి కావాల్సిన 12 కోట్ల వ్యాక్సిన్ డోసుల కోసం వన్ టైమ్ పేమెంట్ చెక్ ఇస్తామని తెలిపారు. నిన్న రాష్ట్రానికి మూడు లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు.