బుల్లితెరను ముంచెత్తిన 'ఉప్పెన'
- వెండితెరపై భారీ విజయం
- బుల్లెతెరపై కూడా తగ్గని ఆదరణ
- ఇంతగా ఆకట్టుకోవడానికి కారణాలివే!
ప్ర్రేమ జంటకు ప్రేక్షకుల అండదండలు ఎప్పుడూ ఉంటాయి .. అందునా సక్సెస్ అయిన జంటాయే. వదులుతారా .. ఒక రేంజ్ రేటింగ్ ఇచ్చి మరీ అభినందించారు. స్టార్ మా ఛానల్ లో మొదటిసారిగా ప్రసారమైన ఈ సినిమాకి, 18.5 రేటింగ్ రావడం విశేషం. ఈ మధ్య కాలంలో ఇంతటి రేటింగ్ ను సాధించిన సినిమా ఇదేనని అంటున్నారు. కథాకథనాల్లోని బలం .. పాత్రలను మలచినతీరు .. ఆకట్టుకునే పాటలు ఈ సినిమా ఇంతగా ప్రేక్షకులకు చేరువకావడానికి కారణమని చెప్పుకుంటున్నారు.