బాలయ్య కెరియర్లోనే భారీ బడ్జెట్ మూవీగా 'అఖండ'
- బాలయ్య .. బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా
- విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్న బాలయ్య
- ఖర్చుకు వెనుకాడని నిర్మాతలు
ఈ సినిమా కోసం 60 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ పారితోషికం కాకుండానే ఈ ఫిగర్ చెబుతున్నారు. బాలకృష్ణ కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని అంటున్నారు. బడ్జెట్ పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణ విలువల పరంగా ఎంతమాత్రం రాజీ పడటం లేదట. కంటెంట్ పై వాళ్లకి గల నమ్మకమే అందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే బాలకృష్ణ - బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడేలానే ఉంది.