'ఎఫ్ 3' థియేటర్లకు వచ్చేది అప్పుడేనట!
- అనుకున్నట్టుగా సాగని షూటింగ్
- ఆగస్టులో థియేటర్లకు రాదనే టాక్
- సంక్రాంతి సెంటిమెంట్ పైనే దృష్టి
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 27వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా షూటింగు జరగలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్లీ మొదలుపెట్టే అవకాశం కూడా లేదు. అందువలన పరిస్థితులు అనుకూలించిన తరువాతనే రంగంలోకి దిగేసి, సంక్రాంతికి విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. 'ఎఫ్ 2' .. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు సంక్రాంతికే సందడి చేశాయి. ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో దిల్ రాజు - అనిల్ రావిపూడి ఉన్నారని చెప్పుకుంటున్నారు.