'ఖుషి'కి 20 ఏళ్లు .. స్పందించిన భూమిక!
- 'ఖుషి'తో నాకు ఉత్తమనటి అవార్డు వచ్చింది
- మా పాత్రలను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు
- ఆ పాటలంటే నాకు చాలా ఇష్టం
తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి భూమిక స్పందించారు. "నేను చేసిన సినిమాల్లో 'ఖుషి' అంటే నాకు చాలా ఇష్టం. ఉత్తమనటిగా నాకు ఈ సినిమా అవార్డు తెచ్చిపెట్టింది. అప్పుడే ఈ సినిమా చేసి 20 ఏళ్లు అయిందా? అనే ఆశ్చర్యం కలుగుతోంది. పవన్ పోషించిన 'సిద్ధు' .. నేను చేసిన 'మధు' పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండటం విశేషం. పీసీ శ్రీరామ్ గారు నన్ను ఎంతో అందంగా చూపించారు. 'అమ్మాయే సన్నగా' .. 'చెలియ చెలియా' పాటలంటే నాకు చాలా ఇష్టం. పవన్ కల్యాణ్ ఎంతో బాగా చేశారు. ఇంతకాలమైనా ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.