ఈ రాత్రి నుంచే కర్ణాటకలో లాక్ డౌన్.. వేటికి అనుమతి ఉందంటే..?
- ఈ రాత్రి 9 గంటల నుంచి లాక్ డౌన్ ప్రారంభం
- రెండు వారాల పాటు కొనసాగనున్న లాక్ డౌన్
- ఉదయం 6-10 గంటల మధ్యలోనే నిత్యావసరాలకు అనుమతి
ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన విమానాలు, రైళ్లను మాత్రం అనుమతిస్తామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. లాక్ డౌన్ కాలంలో మెట్రో రైలు సేవలు కూడా ఉండవని తెలిపింది. ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి లేదని... అత్యవసర సమస్యలు ఉన్నవారికి మాత్రమే ట్యాక్సీలను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లను కస్టమర్ల కోసం తెరవడానికి వీల్లేదని... అయితే, ఆహారాన్ని హోమ్ డెలివరీ చేయవచ్చని తెలిపింది.
నిన్న ఒక్కరోజే కర్ణాటకలో 34,804 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 143 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 13.39 లక్షలకు చేరుకుంది. మొత్తం 14,426 మంది మృతి చెందారు.