ప్లేట్‌లెట్లు పడిపోయినా, తీవ్ర నీరసంగా ఉన్నా కొవిడ్ లక్షణమే: వైద్య నిపుణులు
- ఈ రెండు లక్షణాలు ఉంటే కొవిడ్ లక్షణంగానే భావించాలి
- సకాలంలో గుర్తించకుంటే ప్రాణాపాయం
- హెచ్చరిస్తున్న వైద్యులు
ఈ నెల 18న ఓ వ్యక్తి రక్త పరీక్ష చేయించుకోగా ప్లేట్‌లెట్లు 85 వేలకు పడిపోయాయి. వైద్యుడు రాసిచ్చిన మందులు వాడుతుండగానే ఐదు రోజుల తర్వాత శ్వాస సమస్య కూడా మొదలైంది. అనుమానంతో మరోమారు పరీక్ష చేయగా ప్లేట్‌లెట్లు 20 వేలకు పడిపోయాయి. దీంతో ఈసారి కరోనా పరీక్షలు చేయించగా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించేందుకు ప్రయత్నించగా ఆక్సిజన్ బెడ్లు లేక ఎవరూ చేర్చుకోలేదు. ఈ క్రమంలో వైద్య సాయం కోసం ఎదురుచూస్తూ ప్రాణాలు కోల్పోయాడు.