మహారాష్ట్రలో లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దొరకక శానిటైజర్ తాగిన వైనం.. ఏడుగురి మృతి
- యావత్మాల్ జిల్లాలోని వణీ గ్రామంలో ఘటన
- మరో ముగ్గురి పరిస్థితి విషమం
- ఆసుపత్రిలో చికిత్స
ఈ నేపథ్యంలో మద్యం దొరకకపోవడంతో యావత్మాల్ జిల్లాలోని వణీ గ్రామంలో శానిటైజర్ తాగి ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. వారంతా శానిటైజర్ తాగి పడిపోగా గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు చికిత్స తీసుకుంటూ మృత్యువాత పడ్డారు.