రామ్ మూవీతో జెనీలియా రీ ఎంట్రీ!
- తెలుగులో అల్లరి కథానాయికగా పేరు
- చెప్పుకోదగిన సినిమా 'బొమ్మరిల్లు'
- చివరి చిత్రం రానాతో చేసిన 'నా ఇష్టం'
తెలుగులో జెనీలియాకు మంచి మంచి హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా 'ఢీ' .. 'రెడీ' .. 'బొమ్మరిల్లు' సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి. వివాహమైన తరువాత ఆమె కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తరువాత హిందీలో ముఖ్యమైన పాత్రల్లో అలా కనిపించి మాయమవుతూ వస్తోంది. రానా జోడీగా 2012లో చేసిన 'నా ఇష్టం' సినిమానే తెలుగులో ఆమె చివరి చిత్రం.
ఆ తరువాత ఆమె టాలీవుడ్ వైపు చూడలేదు. మళ్లీ తొమ్మిదేళ్ల తరువాత ఆమె పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.. జెనీలియాను ఏ సినిమా కోసం సంప్రదించారనేదే తెలియాల్సి ఉంది. అందమైన అల్లరిపిల్ల అనిపించుకున్న జెనీలియా రీ ఎంట్రీ నిజమే అయితే, అది ఆమె అభిమానులకు శుభవార్తే!