తెలుగు యువకుడు గిర్రెడ్డి వివేక్ కు రూ. కోటిన్నర వేతనం... అమెజాన్ ఆఫర్!
- పలు ప్రతిష్ఠాత్మక వర్శిటీల్లో విద్య
- ఇటీవల ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ఎంపిక
- హైదరాబాద్ లో స్థిరపడ్డ వివేక్ తల్లిదండ్రులు
ఈ ఉద్యోగం చేసేందుకు బేసిక్ శాలరీతో పాటు, ఇతర ప్రోత్సాహకాలు, అలవెన్సులను కలిపితే, అతనికి ఏడాదికి కోటిన్నర రూపాయల వేతనం లభించనుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వివేక్ తల్లిదండ్రులు సూర్యనారాయణ రెడ్డి, భానులు ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. గతంలో సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కు జీఎంగా పని చేసిన సూర్యనారాయణ రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.