ఏదో ఒకరోజు సీఎం అవుతా: లోటస్ పాండ్ లో షర్మిల వ్యాఖ్యలు
- ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష భగ్నం
- లోటస్ పాండ్ నివాసానికి తరలించిన పోలీసులు
- తన నివాసంలోనే దీక్ష కొనసాగిస్తున్న షర్మిల
- సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు
- తనపై చేయి పడితే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్
ఈ సందర్భంగా ఆమె... ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదో ఒకరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కార్యకర్తలను వదిలేంత వరకు మంచినీళ్లు కూడా తాగనని స్పష్టం చేశారు.