అందాలరాశి పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేసిన మారుతి!
- గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్'
- మారుతి డైరెక్షన్లో మరోసారి రాశి ఖన్నా
- అభిమానుల్లో ఆమె పాత్ర పట్ల ఆసక్తి
ఆ తరువాత లాక్ డౌన్ కి ముందు వచ్చిన 'ప్రతి రోజూ పండగే' సినిమాలో ఆమెతో దర్శకుడు మారుతి కామెడీని చేయించాడు. ఈ సినిమాలో రాశిఖన్నా పోషించిన టిక్ టాక్ స్టార్ ఎంజిల్ ఆర్నా పాత్రకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ సారి కూడా మారుతి ఆమె పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ కామెడీ టచ్ ఇచ్చాడట. గోపీచంద్ హీరోగా ఆయన 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెరపై తాను కనిపిస్తున్నంత సేపు రాశి ఖన్నా నవ్విస్తూనే ఉంటుందట. ఈ పాత్ర కూడా ఆమెకి మంచి పేరును తీసుకురావడం ఖాయమని అంటున్నారు.