వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా.. ఐసీయూలో చికిత్స
- కరోనా సోకడం వాస్తవమేనన్న ఎమ్మెల్యే కార్యాలయం
- ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ
- ఆందోళన అవసరం లేదన్న కార్యాలయం
ఆమెకు కరోనా సోకిన మాట నిజమేనని, అయితే, ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని తెలిపింది. అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది.