తాను స్వయంగా డిజైన్ చేయించుకున్న లాండ్ రోవర్ కారులోనే... శ్మశానానికి ప్రిన్స్ ఫిలిప్ శవపేటిక!
- 15 సంవత్సరాల క్రితం ప్రిన్స్ అభిరుచుల మేరకు తయారీ
- గత వారం ప్రిన్స్ ఫిలిప్ అస్తమయం
- శనివారం నాడు అంత్యక్రియలు
కాగా, టాటా మోటార్స్ సంస్థ బ్రిటన్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ సంస్థను టేకోవర్ చేయడానికి మూడేళ్ల ముందు... అంటే, 2005లో ప్రిన్స్ ఫిలిప్ ఈ వాహనాన్ని తన అభిరుచుల మేరకు డిజైన్ చేయించుకున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన శవపేటికను వాహనంలోకి చేరుస్తారని, ఆపై 8 నిమిషాల తరువాత అది సెయింట్ జార్జ్ చాపెల్ ప్రాంతానికి చేరుతుందని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఈ వాహనం వెంబడి రాజ కుటుంబీకులు, ఇతర ముఖ్యులు నడుస్తారని తెలిపింది.