తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి హిందువు కాదన్న సునీల్ దేవధర్... తాను హిందువునేనంటూ ఆధారాలు విడుదల చేసిన గురుమూర్తి
- తిరుపతి బరిలో వాడీవేడి వాతావరణం
- వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి
- గురుమూర్తి క్రైస్తవుడంటూ దేవధర్ ఆరోపణలు
- పూజలు చేసిన ఫొటోలను పంచుకున్న గురుమూర్తి
అయితే, తాను హిందువునే అంటూ డాక్టర్ గురుమూర్తి ఆధారాలను విడుదల చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకున్నప్పటి వీడియోతో పాటు నామినేషన్ దాఖలు చేసే ముందు గ్రామదేవతకు పూజలు నిర్వహించినప్పటి ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. పది ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని గురుమూర్తి విమర్శించారు.