నైజామ్ లో 'వకీల్ సాబ్' ఫస్టు డే వసూళ్లు!
- ఈ నెల 9వ తేదిన విడుదలైన 'వకీల్ సాబ్'
- ఓవర్సీస్ లోను భారీ వసూళ్లు
- పవన్ పై ప్రశంసల వెల్లువ
విడుదల రోజునే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. నైజామ్ లో తొలిరోజున 8.7 కోట్ల షేర్ ను రాబట్టినట్టు చెబుతున్నారు. వీకెండ్ కి వసూళ్ల పరంగా నైజామ్ లో కొత్త రికార్డును నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఆంధ్రలోను వసూళ్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లోను ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపేస్తోందని అంటున్నారు. ఇటు అభిమానులు మాత్రమే కాదు, అటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా పవన్ ను ప్రశంసలతో ముంచెత్తుతూ ఉండటం విశేషం.