పవన్ అంటేనే కాదు ఆయన సినిమాకు కూడా జగన్ భయపడుతున్నారా?: సునీల్ దేవధర్
- పవన్ ప్రధానపాత్రలో వకీల్ సాబ్
- నేడు విడుదలైన చిత్రం
- ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు, జనసైనికులు
- తిరుపతి జయశ్యాం థియేటర్ వద్ద సునీల్ దేవధర్ నిరసన
ఈ సందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ, వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పవన్ అంటేనే కాదు, ఆయన సినిమా అంటే కూడా జగన్ భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు. తిరుపతిలో పవన్ కవాతు చేసినప్పుడు అసలు సినిమా రిలీజైందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ట్విట్టర్ లోనూ ఘాటుగా స్పందించారు. ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకునే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్ ను చూసి భయపడేది? అని వ్యంగ్యం ప్రదర్శించారు.