పవన్ కాదంటే 'వకీల్ సాబ్' ఆ హీరోతో చేసేవాడట!
- రేపే 'వకీల్ సాబ్' రిలీజ్
- జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్
- నాగార్జున పేరును ప్రస్తావించిన వేణు శ్రీరామ్
"మొదటి నుంచి కూడా నేను పవన్ కల్యాణ్ అభిమానిని. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం 'దిల్' రాజుగారికి తెలుసు. అందువలన నేను మరింత కేర్ తీసుకుని చేస్తానని ఆయన నాకు ఈ ప్రాజెక్టును అప్పగించారు" అని చెప్పాడు. ఒకవేళ పవన్ కల్యాణ్ గారు ఈ సినిమా చేయనని అంటే, అప్పుడు ఈ కథ కోసం ఏ హీరోను ఎంచుకునేవారు? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, "నాగార్జున గారిని ఎంచుకునేవాడిని .. ఎందుకంటే ప్రయోగాలు చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు" అని చెప్పుకొచ్చాడు.