సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మహేశ్ సరసన మళ్లీ పూజ హెగ్డే?
- 'ఆచార్య' కోసం చరణ్ ఫైనల్ షూట్
- డబ్బింగ్ చెబుతానంటున్న ముద్దుగుమ్మ
* కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి విదితమే. రేపటి నుంచి చరణ్ ఈ చిత్రం ఫైనల్ షూటింగులో పాల్గొంటాడు. అతనిపై ఓ విప్లవ గీతాన్ని చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూలుతో చరణ్ షూటింగ్ పూర్తవుతుంది.
* 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ అందుకున్న కథానాయిక నభా నటేష్ ఇప్పుడు నితిన్ సరసన 'మాస్ట్రో' సినిమాలో నటిస్తోంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ ఇప్పుడీ చిత్రానికి సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తోంది. ఈ విషయం గురించి దర్శకుడితో చర్చించానని, ఆయన కూడా తనను ఎంకరేజ్ చేశారనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పింది.