అక్కినేని హీరో జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు!
- విక్రమ్ కుమార్ తో చైతూ మూవీ
- రొమాంటిక్ టచ్ తో సాగే కథ
- అవికా గోర్ కి ఇది మంచి ఛాన్స్
'లవ్ స్టోరీ' విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే చైతూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ టచ్ ఉన్న ఈ కథకి 'థాంక్యూ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో చైతూ రొమాన్స్ చేయనున్నాడు. ఆల్రెడీ ఒక కథానాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారు. మిగతా ఇద్దరు కథానాయికలుగా అవికా గోర్ .. మాళవిక నాయర్ కనిపించనున్నారని తెలుస్తోంది. 'హలో' సినిమాతో అఖిల్ కి హిట్ ఇవ్వడానికి ప్రయత్నించిన విక్రమ్ కుమార్, చైతూ విషయంలో ఆ ముచ్చట తీర్చుకుంటాడేమో చూడాలి.