చరిత్ర తెలియని అధికార పార్టీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
- కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి
- నేడు సాగర్ లో కార్యకర్తల సమావేశం
- హాజరైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
- టీఆర్ఎస్ నేతలు మదమెక్కి మాట్లాడుతున్నారని ధ్వజం
సాగర్ లో జానారెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ టీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గడచిన ఏడేళ్లలో సాగర్ లో టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. జానారెడ్డిని ప్రజలు గెలిపించాలని, ఆయన గెలిస్తే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.