కరోనా బారిన పడిన 'వకీల్ సాబ్' భామ
- టాలీవుడ్ లో కరోనా కలకలం
- నివేదా థామస్ కు కొవిడ్ పాజిటివ్
- ఐసోలేషన్ లో ఉన్నానంటూ నివేదా వెల్లడి
- అందరికీ ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు
తన వైద్య బృందం ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నివేద పేర్కొంది. ఈ సమయంలో తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్టు చేసింది. నివేదా థామస్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ప్రధానపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.