సాగర్ ఉపఎన్నికలో భగత్ కొట్టే దెబ్బకు జానారెడ్డి అడ్రస్ లేకుండా పోతాడు: తలసాని
- సాగర్ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్
- భగత్ కు మద్దతుగా తలసాని, జగదీశ్ రెడ్డి ప్రచారం
- భగత్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న తలసాని
- పోటీ నుంచి తప్పుకుని ఉంటే జానాపై గౌరవం పెరిగేదని వ్యాఖ్య
"సాగర్ బరిలో విపక్షాలకు పుట్టగతులుండవు. ఏడు పర్యాయాలు గెలిచిన జానారెడ్డి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను మాత్రమే ఎదిగారు తప్ప ప్రజలు ఎదగలేదు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ పేరును ప్రకటించిన వెంటనే పోటీ నుంచి తప్పుకుని ఉంటే జానారెడ్డి పట్ల ఎంతో గౌరవం కలిగేది. అయితే భగత్ కొట్టే దెబ్బకు ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని జానారెడ్డి శాశ్వతంగా మర్చిపోతాడు" అని తలసాని వ్యాఖ్యానించారు.