నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన మంత్రి పేర్ని నాని
- పరిషత్ ఎన్నికలపై గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ
- శ్రీరంగనీతుల లేఖ అంటూ పేర్నినాని ధ్వజం
- బ్రహ్మచర్యంపై తిరుగుబోతు పుస్తకం రాసినట్టుందని ఎద్దేవా
- చంద్రబాబు కనుసన్నల్లో పనిచేశారని ఆరోపణ
బ్రహ్మచర్యంపై ఓ తిరుగుబోతు పుస్తకం రాసినట్టుందని విమర్శించారు. నిమ్మగడ్డ లేఖను చూస్తే చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం పొంతన కుదరడంలేదన్న విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు.
నిమ్మగడ్డ ఎవరి మెప్పుకోసం పనిచేశారో అందరికీ తెలుసని, బాబు కనుసన్నల్లోనే ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. కరోనా కేసులు లేనప్పుడు ఎన్నికలు ఆపి, కేసులు వస్తున్నప్పుడు ఎన్నికలు జరిపారని మండిపడ్డారు.