సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'సారంగ ధరియా' పాటకు మరో రికార్డు
- 'దృశ్యం 2' కోసం కేరళకు వెంకటేశ్
- 'జెర్సీ' దర్శకుడితో నాని మరో సినిమా
- దుబాయ్ షెడ్యూల్ పూర్తిచేసిన విశాల్
* మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2' చిత్రాన్ని జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి కేరళలో జరుగుతోంది. వెంకటేశ్, మీనా తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు.
* ఆమధ్య గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' చిత్రం మంచి హిట్టయింది. జాతీయ అవార్డు కూడా పొందింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో మరో సినిమా రూపొందనుంది. దీపావళి నుంచి ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందట.
* విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'ఎనిమీ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల నెల రోజుల పాటు దుబాయ్ లో జరిగింది. త్వరలోనే రెండో షెడ్యూలు చెన్నైలో మొదలవుతుంది. ఇందులో ఆర్య మరో కీలక పాత్రను పోషిస్తున్నాడు.