జన్మదినం సందర్భంగా రామ్ చరణ్ కు అరుదైన గౌరవం
- న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై చరణ్ ఫొటోలు
- చరణ్ ను అలా చూడడం అద్భుతంగా ఉందన్న ఉపాసన
- ఇదొక తియ్యని అనుభూతి అని వెల్లడి
- ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్
ఈ ఏడాది మాకు చిరస్మరణీయం కానుంది: ఎన్టీఆర్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న ప్రాణస్నేహితుల ప్రస్తావన వస్తే వాళ్లిద్దరి గురించి కూడా చెప్పుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. ఈ ఏడాది తమకు చిరస్మరణీయం కానుందని పేర్కొన్నారు. "సోదరా... నీతో గడిపిన క్షణాలు ఎల్లప్పటికీ నిలిచిపోతాయి" అని వివరించారు. దీనిపై ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పందిస్తూ 'భీమ్ అండ్ రామరాజు' అంటూ ట్వీట్ చేసింది.