ఓటీటీ ప్లాట్ ఫామ్ స్వేచ్ఛను లాగేసుకోవడం సరికాదు: రాధికా ఆప్టే
- ఓటీటీ కంటెంట్ పై నిబంధనలు విధించిన కేంద్రం
- భావ ప్రకటన స్వేచ్ఛ అవసరమన్న రాధికా ఆప్టే
- ఓటీటీ వల్ల కొత్త ఆలోచనలు ప్రజలకు చేరుతున్నాయని వ్యాఖ్య
ఓటీటీ కారణంగా ఎన్నో కొత్త ఆలోచనలు ప్రజలకు చేరుతున్నాయని... వీటి వల్ల ఎందరికో ఉపాధి లభిస్తోందని రాధికా ఆప్టే వ్యాఖ్యానించింది. రాబోయే ఐదారేళ్లలో మరెన్ని మార్పులు వస్తాయో చూడాలని చెప్పింది. మరోవైపు ఆమె నటించిన కొన్ని వెబ్ సిరీస్ లు నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాయి. వీటిలో ఆమె నటించిన కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉండటంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై కూడా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అందాల ఆరబోతకు వెనుకాడని రాధికా ఆప్టేలాంటి వాళ్లు ఇలాగే మాట్లాడతారని మండిపడుతున్నారు.