గవర్నర్, ఎస్ఈసీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్... బొత్స, పెద్దిరెడ్డిలకు హైకోర్టు నోటీసులు
- తన ప్రివిలేజ్ లెటర్స్ లీకయ్యాయంటున్న ఎస్ఈసీ
- ఎక్కడ్నించి లీకయ్యాయో తెలుసుకోవాలంటూ పిటిషన్
- సీబీఐ విచారణ వేయాలని హైకోర్టుకు వినతి
- పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం
- తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా
తాను రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ కార్యాలయం నుంచి ఎలా బయటికి వస్తున్నాయో తెలుసుకోవాలని ఎస్ఈసీ తన పిటిషన్ లో కోరారు. ప్రివిలేజ్ లెటర్స్ లీక్ కాలేదని గవర్నర్ కార్యాలయం కార్యదర్శి చెబుతున్నారని, మరి ఆ లేఖలు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయన్నది తేల్చాలని విజ్ఞప్తి చేశారు. పైగా ఆ లేఖలను సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని, తన లేఖలు సోషల్ మీడియాలోకి రావడం ఎలా సాధ్యమో గుర్తించాలని పేర్కొన్నారు.