ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కమలహాసన్‌కు పట్టం కడతారు: నటి రాధిక
- మాది బలమైన కూటమి
- విద్యావంతులు, మేధావులు మార్పు కోసం చూస్తున్నారు
- గెలిపిస్తే పాలనలో మార్పు తీసుకొచ్చి చూపిస్తాం
విద్యావంతులు, మేధావులు మార్పును కోరుకుంటున్నారని, ఇది చాలా అరుదైన ప్రగతిశీల ఆలోచన అని అన్నారు. గుడ్ గవర్నెన్స్ కోసం తమకు ఓటేస్తే పరిపాలనలో మార్పు తీసుకొచ్చి చూపిస్తామని రాధిక హామీ ఇచ్చారు. కూటమి పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలు చూస్తే సుపరిపాలనకు, వాస్తవికతకు ఎంత దగ్గరగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. మార్పు కోరుకుంటున్న ప్రజలు ఈసారి కమల్‌కు అవకాశం ఇస్తారని గట్టిగా నమ్ముతున్నట్టు రాధిక అన్నారు.