నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి
- నోముల మృతితో ఉప ఎన్నిక
- ఏప్రిల్ 17న పోలింగ్
- అభ్యర్థిని ప్రకటించిన ఏఐసీసీ
- జానారెడ్డి అభ్యర్థిత్వానికి సోనియా ఆమోదం
సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తారని ఏఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. జానారెడ్డి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.