కొన్ని సాంకేతిక కారణాలతో 'రౌడీబేబీ' సినిమా టైటిల్ మార్చుతున్నాం: కోన వెంకట్
- సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా 'రౌడీబేబీ' చిత్రం
- మరో టైటిల్ ప్రకటిస్తామన్న కోన వెంకట్
- దాంతోపాటే రిలీజ్ డేట్ కూడా వెల్లడిస్తామని వివరణ
- 'రౌడీబేబీ'కి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కోన
- జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చిత్రం
"కొన్ని మార్పులు ఆహ్లాదకరంగా, ఎంతో బాగుంటాయి. మేం వెల్లడించబోయే ఉద్విగ్నభరితమైన కొత్త టైటిల్ కోసం వేచిచూడండి. దాంతోపాటే అప్ డేటెట్ లుక్, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం" అని కోన వెంకట్ వివరించారు.
కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ బ్యానర్ పై ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, బాబీ సింహా కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.