నాకు వచ్చిన ఈ అవార్డును అలాంటి పురుషులకు అంకితమిస్తున్నాను: ఉపాసన కొణిదెల
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు
- అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఎంపిక చేసిన ఫిక్కో
- మహిళలకు మద్దతు తెలిపే వారికి అంకితమిచ్చిన ఉపాసన
'తన భార్య, తల్లి, సోదరి, కూతురు, కోడలు, మనవరాలి జీవితాల్లో వెలుగులు నింపే ప్రతి పురుషుడికి ఈ అవార్డును అంకితమిస్తున్నాను. పురుషుల మద్దతు వుండే మహిళలు చాలా సురక్షితంగా, సానుకూల దృక్పథంతో, విజయాలు సాధిస్తూ ఉంటారు అని నేను నమ్ముతాను' అని ఉపాపన ట్వీట్ చేసింది. కాగా, ఉపాసన అనేక సామాజిక, ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.