'శాకుంతలం'లో దుష్యంతుడిగా మలయాళ నటుడు!
- గుణశేఖర్ తాజా చిత్రం 'శాకుంతలం'
- శకుంతల పాత్రలో అందాల సమంత
- దుష్యంతుడిగా దేవ్ మోహన్
- ప్రస్తుతం భారీ సెట్స్ నిర్మాణం
ఇక ఇందులో మరో ముఖ్య పాత్ర అయిన దుష్యంతుడి పాత్ర గురించి ఇటీవలి కాలంలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలో, తాజాగా ఈ దుష్యంతుడి పాత్రకు మలయాళ యువ నటుడు దేవ్ మోహన్ ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు.
దీనిని పేర్కొంటూ హీరోయిన్ సమంత ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం భారీ సెట్స్ ను వేస్తున్నారు. త్వరలోనే చిత్రం షూటింగును ప్రారంభిస్తారు.