వారణాసి వీధుల్లో పానీ పూరీ లాగించిన స్మృతీ ఇరానీ
- వారణాసిలో పర్యటించిన స్మృతీ ఇరానీ
- ఇష్టంగా పానీ పూరీలు తిన్న కేంద్ర మంత్రి
- సెల్ఫీల కోసం పోటీ పడ్డ ప్రజలు
రోడ్డుపై స్మృతీ ఇరానీని చూడగానే, పలువురు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆమె కూడా ఓపికతో ఫొటోలకు పోజులిచ్చారు. వారణాసిలో జరుగుతున్న బీజేపీ సమావేశాల నిమిత్తం ఆమె వచ్చారు. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు హాజరయ్యారు.