హీరో నితిన్ వీపుపైకి ఎగిరి దూకబోయి కిందపడిన ప్రియా ప్రకాశ్... ఫన్నీ వీడియో ఇదిగో!
- 'చెక్' సినిమాలో నటిస్తున్న ప్రియా ప్రకాశ్
- సినిమా షూటింగ్ లో చిరు ప్రమాదం
- తనకేమీ కాలేదన్న ప్రియ
షూటింగ్ లో భాగంగా, నితిన్ నడుస్తూ రాగా, వెనుక నుంచి పరిగెత్తుకుని వచ్చే ప్రియా ప్రకాశ్, ఎగిరి, వీపుపైకి ఎక్కాల్సి వుంది. ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో పట్టుతప్పిన ప్రియ, వెల్లకిలా నేలపై పడిపోయింది. పక్కనే ఉన్న సిబ్బంది వచ్చి ఆమె పైకి లేచేందుకు సాయం చేయగా, తనకేమీ కాలేదన్నట్టుగా 'థంబ్' చూపించింది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.