నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మొవ్వ అరుణ్ కుమార్... ఎల్. రమణకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా చాన్స్
- కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ టీడీపీ
- త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు
- గ్రాడ్యుయేట్స్ బరిలో ఎల్.రమణ
- హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ
ఈ మేరకు తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ తెలిపారు. ఇక తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎల్.రమణ... రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు.