నాటి 'చిత్రం' సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్న తేజ!
- ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'చిత్రం'
- హీరోగా ఉదయ్ కిరణ్ పరిచయం
- దర్శకుడిగా మారిన కెమెరామేన్ తేజ
- 'చిత్రం 1.1'గా సీక్వెల్ నిర్మాణం
ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తుండడం విశేషం. 'చిత్రం 1.1' పేరుతో దీనిని నిర్మిస్తున్నట్టు పేర్కొంటూ, దర్శకుడు తేజ ఈ రోజు టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. తేజ చిత్ర నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్, ఎన్ స్టూడియోస్ కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక 'చిత్రం'లోలానే ఇందులో కూడా కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగును నిర్వహిస్తారు. దీనికి కూడా ఆర్ఫీ పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.