Keerthy Suresh: కీర్తి సురేశ్ ప్రేమ, పెళ్లి అంటూ జోరుగా కథనాలు...!

Love and Marriage rumors of Keerthi Suresh

  • అనిరుధ్ రవిచందర్ తో కీర్తి లవ్ లో ఉందంటూ కథనాలు
  • త్వరలోనే పెళ్లి అంటూ ప్రచారం
  • పెద్దల అంగీకారంతో ఒక్కటవనున్నారని ఊహాగానాలు
  • ఆంగ్ల మీడియాలో కథనాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ విషయమైనా వేగంగా పాకిపోతోంది. తాజాగా, అందాల నటి కీర్తి సురేశ్ కు సంబంధించిన విషయాలు కూడా సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఆంగ్ల మీడియాలోనూ ఇవే వార్తలు వస్తుండడం గమనార్హం. కీర్తి సురేశ్ దక్షిణాది యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తో ప్రేమలో ఉందని, త్వరలోనే ఇద్దరూ పెళ్లితో ఒక్కటవ్వనున్నారని కథనాలు వస్తున్నాయి.

ఇటీవలే కీర్తి సురేశ్, అనిరుధ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి జరగొచ్చని, పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కుతారని ఈ ఊహాగానాల సారాంశం. దీనికి సంబంధించి క్లారిటీ రావాలంటే అటు అనిరుధ్ కానీ, ఇటు కీర్తి కాని ప్రకటన చేయాల్సిందే. అప్పటివరకు ఈ కథనాలకు అడ్డుకట్ట పడకపోవచ్చు.

Keerthy Suresh
Love
Marriage
Rumors
Anirudh Ravichandar
  • Loading...

More Telugu News