మహేశ్ బాబు, నమ్రత దంపతులకు సితార వాలంటైన్స్ డే గిఫ్టు
- నేడు వాలంటైన్స్ డే
- చేతిరాతతో కూడిన కార్డు రూపొందించిన సితార
- తల్లిదండ్రులకు బహూకరణ
- మురిసిపోయిన మహేశ్ బాబు
- అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ శుభాకాంక్షలు
దీనిపై మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. తన ముద్దుల తనయ సితార అందించిన కార్డును ఆయన పంచుకున్నారు. "థాంక్యూ సితు పాపా" అంటూ మురిసిపోయారు. "నేను ప్రేమించే ప్రతి ఒక్కరికీ, మీరు ప్రేమించే ఇతరులందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే" అంటూ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం దుబాయ్ లో ఉంది. మహేశ్ నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.