వాలంటైన్స్ డేని 'మాతా పిత పూజా దినోత్సవం'గా పాటిస్తాం: ప్రమోద్ ముతాలిక్
- ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే
- ఎప్పట్నించో వ్యతిరేకిస్తున్న హిందుత్వ సంఘాలు
- స్పందించిన శ్రీరామ్ సేన
- వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదన్న ప్రమోద్ ముతాలిక్
కర్ణాటకలో ప్రేమికుల రోజు సందర్భంగా జరిగే అభ్యంతరకర కార్యక్రమాలను అడ్డుకుంటామని, అందుకోసం ప్రత్యేకంగా స్వచ్ఛంద సేవకులను నియమిస్తామని వెల్లడించారు. పార్కులు, పబ్ లు, బార్లు, ఐస్ క్రీమ్ పార్లర్లపై తమ వర్గాల నిఘా ఉంటుందని ప్రమోద్ ముతాలిక్ స్పష్టం చేశారు. పోలీసులకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు.