ఇండియా సిరీస్ గెలవగానే కళ్లు చెమ్మగిల్లాయి: వీవీఎస్ లక్ష్మణ్
- గాబాలో ఇండియా గెలవగానే భావోద్వేగానికి గురయ్యాను
- ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై గెలవడం నా కల
- 2011లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా కన్నీళ్లు వచ్చాయి
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై గెలవడం తన కల అని లక్ష్మణ్ అన్నారు. తన కలను యువ ఆటగాళ్లు నెరవేర్చడం గర్వంగా అనిపించిందని చెప్పారు. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి అని అన్నారు. తాను తన జీవితంలో కేవలం రెండు సార్లు మాత్రమే కంటతడి పెట్టుకున్నానని చెప్పారు. మన దేశం 2011లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా కన్నీళ్లు వచ్చాయని అన్నారు. అప్పుడు వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్లందరితో కలిసి తాను ఆడానని చెప్పారు. వాళ్లంతా ప్రపంచ కప్ ను గెలవాలనే కలను సాకారం చేసుకోవడం చూసి భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.