చిరంజీవి సినిమాలో మరోసారి నయనతార?
- మలయాళ 'లూసిఫర్' రీమేక్ లో చిరంజీవి
- ఇటీవల హైదరాబాదులో ప్రారంభం
- తెలుగులో జతచేస్తున్న హీరోయిన్ పాత్ర
ముఖ్యంగా తెలుగులో చిరంజీవి సరసన హీరోయిన్ పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో మలయాళంలో లేని ఆ క్యారెక్టర్ ను ఇక్కడ జత చేస్తున్నారట. పైగా, ఆ పాత్రను కూడా కాస్త పవర్ ఫుల్ గానే రూపుదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఈ హీరోయిన్ పాత్రకు ప్రముఖ కథానాయిక నయనతారను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం. చిరంజీవి స్టేచర్ కి నయనతార అయితే, బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమెను ఎంచుకున్నట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డైలాగుల వెర్షన్ రచన జరుగుతోంది. ప్రముఖ రచయితలు ఆకుల శివ, బుర్రా సాయిమాధవ్ లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.