పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ మంత్రి పితాని
- ప్రతి ఎన్నికల సమయంలోనూ ఇలా ప్రచారం చేస్తున్నారు
- పాత్రికేయ రంగానికే సిగ్గుచేటు
- అధికార మదంతో విర్రవీగుతున్న వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి
కొన్ని ప్రసార, సామాజిక మాధ్యమాలు వ్యక్తుల విలువలను మంటగలిపేలా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్రికేయ రంగానికే ఇది సిగ్గుచేటని అన్నారు. తాను ఓడిపోయినా ప్రజా క్షేత్రంలోనే ఉన్నానని, ప్రజా సమస్యలపై నేటికీ పోరాడుతున్నానని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీకి అమ్ముడుపోయి తనను మలిన పరచడం ఏంటని పితాని ప్రశ్నించారు. అధికార మదంతో స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని ప్రజలను పితాని కోరారు.